వెనుకబడిన వర్గాల విషయంలో మన దేశంలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా అట్రాసిటి కేసుల విషయంలో వెనుకబడిన వర్గాల వారికి న్యాయం ఎక్కువగా జరుగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఇక ఇక అట్రాసిటీ కేసు ఎలా పెట్టాలి అనేది చాలా మందికి అవగాహన లేదు. ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు అయితే వెంటనే అరెస్ట్ చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఎస్సి/ఎస్టి అట్రాసిటీ ఆక్ట్ 1989 (2018) ప్రకారం ఇది వర్తిస్తుంది.
అట్రాసిటీ ఆక్ట్ అంటే అర్ధం ఏంటో చూస్తే… వెనుకబడిన వర్గాల వారిని… కులం పేరుతో తిట్టినా లేదంటే మాటలతో, చూపులతో వేధించినా సరే… ఫోన్ లో దూషించినా, తిండి, సంస్కృతి, మతం పై ఆంక్షలు విధించినా సరే… అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా వివక్ష చూపినా… సోషల్ మీడియా లో కించపరిచినా, ద్రోహం, కుట్ర చేసినా సరే ఈ చట్టం ద్వారా శిక్ష పడుతుంది.
ఎస్సి/ఎస్టి అట్రాసిటీ యాక్ట్ 1989, సవరణ 2018 ప్రకారం… ఎస్సి/ఎస్టి అట్రాసిటీ ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. పై అధికారుల అనుమతి తో నిమిత్తం లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఉంది. సెక్షన్ 438 సిఆర్పీసీ క్రింద నిందితులు బెయిల్ పొందే అవకాశం లేదు. ఇక ఫిర్యాదు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఎవరైనా నేరం గురించి తెలిసినా వ్యక్తి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుడే పిర్యాదు చెయ్యాలనే నిబంధన ఏమి లేదు. సంఘటన జరిగిన పరిధిలోని పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారి ఎవరు అంటే… డీఎస్పీ లేదంటే ఏఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఫిర్యాదుపై దర్యాప్తు చెయ్యాలి. 30 రోజుల్లో ఆ అధికారి దర్యాప్తు పూర్తి చెయ్యాలి.