ప్రస్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలకు అవసరమైన డాక్యుమెంట్ గా మారింది పాన్ కార్డు. పాన్ కార్డ్ లేకపోతే బ్యాంకు ఖాతా తెరవడం కూడా కష్టం. ఇక పాన్ కార్డు పోయింది అంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఒరిజినల్ పాన్ కార్డు లేనప్పుడు, లేదా పోగొట్టుకున్నప్పుడు ఈ–పాన్ కార్డును వాడుకోవచ్చు. ఈ–పాన్ ఫోన్లోనే ఉండడంతో ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇది పోయే అవకాశం కూడా లేదు.
ఈ పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే?
ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి
https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
డౌన్‌లోడ్ ఇ-పాన్ కార్డ్ పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి
పాన్ నంబర్ తో పాటు ఆధార్ నంబర్‌ను కూడా ఎంటర్ చేయాలి
పుట్టిన తేదీని ఎంటర్ చేసి, నిబంధనలు, షరతులను అంగీకరించినట్టు క్లిక్ చేయండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేయండి
తర్వాత మనీ పే చేయడానికి ఓ ఆప్షన్ కనిపిస్తుంది
ఈ పాన్ కోసం రూ. 8.26 చెల్లించాల్సి ఉంటుంది. మీరు Paytm, UPI, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు
ఆ తర్వాత ఈ–పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
PDF లో ఈ–పాన్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం. పాస్‌వర్డ్ పుట్టిన తేదీనే అని గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పోయిన పాన్‌తో ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగిందా అనే విషయాన్ని ఫామ్ 26AS ద్వారా తెలుసుకోవచ్చు.