పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ ఇప్పుడు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు అత్యంత అవసరమైన పత్రాలు. ఈ రెండు లేకుండా కీలక ఆర్ధిక లావాదేవీలు జరగడం అనేది సాధ్యం కాదు. ఇక ఆధార్ కార్డు అన్ని విషయాల్లో కీలకం కావడంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలక అడుగు వేసింది. ఇప్పుడు భారతీయులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకపోయినా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఆధార్ కార్డును పొందే అవకాశం కల్పించారు.
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, మార్చి 31, 2022లోపు ఆధార్, పాన్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుంది. మార్చి 30, 2022 నాటి CBDT సర్క్యులర్ ప్రకారం, “ఇంకా, ఆదాయపు పన్ను నిబంధన 114AAA నియమం ప్రకారం, ఒక వ్యక్తి పాన్ కార్డు ని లింక్ చేయకపోతే మాత్రం చోటు చేసుకునే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మీరు ఇప్పటికే మీ ఆధార్ కార్డ్‌తో మీ పాన్‌ను లింక్ చేసారో లేదో అనేది చెక్ చేయడానికి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి incometaxindiaefiling.gov.in/aadhaarstatus లింక్ ఓపెన్ చేయండి. పాన్ మరియు ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తర్వాతి స్క్రీన్ లో స్టేటస్ కనపడుతుంది.