ఈ మధ్య కాలంలో కళ్ళకు మసక అనేది ఎక్కువగా పెరుగుతుంది. క్రమంగా ఇది తీవ్రమవుతూనే ఉంది. దాదాపుగా కళ్ళజోడుతోనే కనపడుతున్నారు చాలా మంది. ప్రస్తుతం కళ్ళ జోడు బాధితుల్లో ఎక్కువ మంది ఫోన్ దెబ్బకు లేదా కాలుష్యం దెబ్బకే వస్తున్నారు. ఇక చిన్న చిన్న పిల్లలకు కూడా చదువు దెబ్బకు వచ్చేస్తుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ పై గడపడం, బుక్స్ కి ఎక్కువ సమయం కేటాయించడం వంటివి మసకకు కారణంగా మారాయి.
ఇక కంటి మసక విషయంలో ఆహారంతో పాటుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఏం చేస్తే కంటి మసక దూరమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి అని వైద్యులు చెప్తున్నారు. అయితే వాటిని జ్యూస్ లాగా కూడా తాగడం మంచిది. చేపలు ఎక్కువగా తినడం కంటికి చాలా మంచిది. అదే విధంగా పుస్తకాలను కంటికి కొద్ది దూరంలో ఉంచి చదవడం మంచిది.
ఇక రెగ్యులర్ గా ఫోన్లు చూడటం తగ్గించాలి. అలాగే కంటి అద్దాలు అవసరం అయినప్పుడు మాత్రమే తీసేయాలి. అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు తీయడం వల్ల సైట్ పెరుగుతుంది. అలాగే తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చెయ్యడం వల్ల కళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి. కళ్ళ మూసుకొని కంటి పైన కీరదోస ముక్కల్ని పెట్టడం వల్ల కళ్ళు చల్లబడే అవకాశం ఉంటుంది.