దంతాలను తెల్లగా మెరిసేలా ఎంత శుభ్రం చేసినా సరే వాటి మధ్య పాచి కొందరికి అలాగే ఉంటుంది. దీన్ని తొలగించుకునేందుకు కొందరు డెంటిస్టుల వద్దకు వెళ్తుంటారు. కొందరు ప్రత్యేకమైన టూత్‌పేస్ట్‌లను తెచ్చి వాడుతారు. ఇంకొందరైతే రక రకాల పద్ధతులను ట్రై చేస్తారు. అయితే ఈ ఇబ్బందులన్నీ పడకుంగా చాలా సింపుల్‌గానే దంతాల మధ్య ఉండే పాచిని సులభంగా తొలగించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన పదార్థాలతో ఓ మిశ్రమాన్ని తయారు చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఆ పదార్థాలు ఏమిటంటే…
దంతాల మధ్య ఉండే పాచిని తొలగించే మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు…
* బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బొనేట్ – 2 టేబుల్‌స్పూన్లు
* నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
* టూత్‌పేస్టు – 1 టేబుల్ స్పూన్
* యాపిల్ సైడర్ వెనిగర్ – 1 టేబుల్ స్పూన్
* ఆర్గానిక్ కొకొనట్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
* అల్యూమినియం ఫాయిల్ పేపర్ – సరిపడినంత
మిశ్రమాన్ని తయారు చేసే విధానం…
స్టెప్ 1 : ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, టూత్‌పేస్టును కలిపి బాగా మిక్స్ చేయాలి.
స్టెప్ 2: ఆ మిశ్రమంలో నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ లను కూడా పోసి బాగా కలపాలి.
స్టెప్ 3: చివరిగా కొబ్బరినూనెతోపాటు ఇతర పదార్థాలను అన్నింటినీ వేసి నురగలాంటి మిశ్రమం వచ్చే వరకు బాగా కలపాలి. దీంతో మిశ్రమం రెడీ అవుతుంది.
పైన తెలిపిన విధంగా తయారైన మిశ్రమాన్ని దంతాలకు అప్లై చేయాలి. అందుకు గాను అల్యూమినియం ఫాయిల్స్‌ను వాడాలి. ఒక అల్యూమినియం ఫాయిల్‌ను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేయాలి. రెండు భాగాలపై ఆ మిశ్రమాన్ని రాయాలి. పైన దంతాలపై ఒక ఫాయిల్, కింద దంతాలపై ఒక ఫాయిల్‌ను ఉంచాలి. తరువాత 2 నిమిషాలు ఆగి ఫాయిల్స్‌ను తీసేయాలి. అనంతరం సాధారణ ట్యాప్ వాటర్‌తో నోరు కడుక్కోవాలి. ఇక మిగిలిన మిశ్రమంతో దంతాలను తోముకోవాలి. దాన్ని మళ్లీ ఉపయోగించేందుకు నిల్వ చేయరాదు. అనంతరం 2 నిమిషాల పాటు దంతాలను తోమాక నోటిని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. దీంతో మీకు ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ వస్తుంది. దంతాల మధ్య పాచి పోతుంది. దంతాలు తెల్లగా మెరుస్తాయి.