వాట్సాప్‌లో మనం స్టేటస్‌లను పెట్టుకుంటే మన వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరూ మన స్టేటస్‌ను చూస్తారు. మనం స్టేటస్‌లో ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, లింక్‌లను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అయితే మనం వాట్సాప్ లో పెట్టే స్టేటస్‌ను డిఫాల్ట్‌గా అందరూ చూస్తారు. కానీ కేవలం కొందరు మాత్రమే, అది కూడా మనం ఎంపిక చేసిన వారు మాత్రమే మన స్టేటస్‌ను చూసేలా అందులో సెట్టింగ్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో…
* వాట్సాప్‌ను ఫోన్‌లో ఓపెన్ చేయండి.
* స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* స్టేటస్ విండోలో పై భాగంలో కుడి వైపు ఉండే 3 నిలువు చుక్కలపై క్లిక్ చేయాలి.
* అందులో స్టేటస్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంతరం వచ్చే విండోలో 3 ఆప్షన్లు ఉంటాయి. వాటిల్లో ఓన్లీ షేర్ విత్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీ వాట్సాప్ స్టేటస్‌ను ఎవరు అయితే చూడాలనుకుంటారో వారి కాంటాక్ట్‌లను అక్కడ ఇవ్వాలి. ఈ క్రమంలో మీరు వాట్సాప్‌లో పెట్టే స్టేటస్‌లను అంతకు ముందు సెట్ చేసుకున్న వారే చూస్తారు. వేరే వారు చూడలేరు.
* అయితే స్టేటస్ ప్రైవసీ విండోలో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే స్టేటస్‌ను ఎవరు చూడవద్దని కోరుకుంటారో వారి కాంటాక్ట్‌లను ఇవ్వవచ్చు. ఇలా రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. దీంతో మీ వాట్సాప్ స్టేటస్‌ను మీరు కావాలనుకునే వారే చూసేందుకు అవకాశం ఉంటుంది.
ఐఫోన్‌లో…
* ఐఫోన్లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.
* అందులో స్టేటస్ ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* అక్కడ పై భాగంలో ఎడమ వైపు ప్రైవసీ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* అనంతరం అందులో పైన చెప్పినట్లుగానే 3 ఆప్షన్లు వస్తాయి. వాటిల్లో కావల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీ వాట్సాప్‌ను కేవలం మీరు కావాలనుకునే వారు మాత్రమే చూస్తారు.
అయితే మీ వాట్సాప్ స్టేటస్‌ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు డిఫాల్ట్‌గా చూస్తారు. కానీ అందుకు వారి కాంటాక్ట్ మీ ఫోన్‌లో ఉండాలి. అలాగే మీ కాంటాక్ట్ వారి ఫోన్‌లో ఉండాలి. అప్పుడే ఒకరి స్టేటస్‌ను ఒకరు చూడగలరు.