మన దేశంలో ఆధార్ లేకుండా ఏ పని జరిగే అవకాశమే లేదనే చెప్పాలి. అయితే ఆధార్ కార్డు విషయంలో చిన్న చిన్న పనులు కాస్త చికాకు పెడుతూ ఉంటాయి. ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటిగా ఉండటంతో ఈ పనులు కాస్త చిరాకుగానే ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన ఈ కార్డ్ ను ఏ అవసరం ఉన్నా అడుగుతున్నారు.
అయితే సరైన సమయంలో ఏదైనా అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. UIDAI వెబ్‌సైట్ లేదంటే ఆధార్ కేంద్రం నుండి మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు.
UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. https://uidai.gov.in/.
‘ఆధార్ సర్వీస్ సెక్షన్’ కింద ‘సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి.
సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి చేసి, అవసరమైన అన్ని ఇతర వివరాలను పూర్తి చేయాలి.
ఆ తర్వాత OTP కోసం క్లిక్ చేయాలి.
OTPని ఎంటర్ చేసిన తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్డేట్ డేటా బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు మీ లోకల్ భాషను ఎంచుకున్న తర్వాత వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
ఆ తర్వాత మీకు మరో ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత అక్కడ అన్నీ చెక్ చేసుకుని ప్రొసీడ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. 50 రూపాయలు కూడా కట్టాలి. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం రిస్క్ అనుకుంటే స్థానిక కేంద్రానికి వెళ్ళండి.