మన శరీరంలో కొవ్వు అనేది కాస్త ఇబ్బందికరం. కొవ్వు విషయంలో జాగ్రత్తగా లేకపోతే మన ప్రాణానికి ప్రమాదం. కొవ్వు ఉందని చాలా మంది ఆపరేషన్ చేయిస్తే అది ప్రాణాల మీదకు వస్తుంది. సినిమాలలో నటించే హీరోలు, హీరోయిన్ లు, ఇతర నటులు దీని మీద దృష్టి పెట్టి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇక మన శరీరంలో మంచి కొవ్వు ఎలా కాపాడుకోవాలి, చెడు కొవ్వు ఎలా పోగొట్టుకోవాలి…?
Also Read:దీపికకు ఏమైంది?
చెడు కొలెస్ట్రాల్ అంటే గుండెకు హాని చేసిది. ఎక్కువ నూనె పదార్థాలు తినడం, సరైన వ్యాయామం చేయకపోవడంతో ఇది మన శరీరంలో క్రమంగా పెరుగుతూ పోతుంది. తగ్గించాడనికి శారీరక శ్రమ కావాలి. అలాగే రోజు నడక కానీ పెరిగెట్టడం కానీ చేయాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి కార్డియో వ్యాయామాలు చాలా వరకు సహకరిస్తాయి. అనవసరంగా వైద్యం చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
ఇక మంచి కొలెస్ట్రాల్ విషయానికి వస్తే… ఇది మన గుండె కు మంచి చేసేది. ఇది ఆహారం ద్వారా మన శరీరానికి అందుతుంది. ముఖ్యంగా ఆలివ్ నూనె లో ఈ మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ధూమపానం మానేయడం కూడా ఇది పెరగడానికి సహాయం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగేకొద్దీ మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ ఉండాలి. అందుకు మంచి కొలెస్ట్రాల్ కూడా కాస్త ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది కాదు. సాధ్యమైనంత శారీరక శ్రమ అవసరం. చెడు కొలెస్ట్రాల్ ప్రమాద స్థాయిలో పెరిగినప్పుడు నరాల్లో పేరుకు పోయి గుండె కు రక్త సరఫరా జరగక గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
Also Read:ఫినిక్స్ కబ్జాకో లెక్కుంది!