వాస్తవం మాట్లాడితే… మాములుగా మన తెలుగులో హీరో కావాలంటే ఎర్రగా బుర్రగా ఉండాలి. అదే తమిళంలో అయితే మంచి నటన ఉంటే చాలు అంటారు. రంగుతో సంబంధం లేకుండా అక్కడి హీరోలకు క్రేజ్ ఉంది. ఇలా క్లిక్ అయిన వారిలో విజయ్ సేతుపతి ఒకరు. ఎప్పుడో హీరో అయినా గత అయిదేళ్ళ నుంచి ఇతనికి మంచి ఇమేజ్ వచ్చింది. విలన్ పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు.
తెలుగులో కూడా అతనికి క్రేజ్ భారీగా పెరిగింది. మెగా హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఆయన చిరంజీవి సినిమాలో కనపడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే విజయ్ సేతుపతి లైఫ్ లో మద్యం ఎలా ప్రవేశించింది అనేది తెలుసుకుందాం. ఒక సందర్భంలో మాట్లాడిన విజయ్ తనకు మద్యం ఎలా అలవాటు అయిందో చెప్పాడు.
తాను ఇంటర్ సెకండియర్ చదివే సమయంలో చదువు పెద్దగా రాలేదట. ఆ సమయంలో మార్కులు కూడా పెద్దగా వచ్చేవి కాదట. మూడు కాలేజీలకు సీటు దరఖాస్తు చేస్తే మూడు కాలేజీలలో ఏ ఒక్క కాలేజీలో సీటు రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంటికి వెళ్తే తన తండ్రి మద్యం తాగి ఉన్నారని… ఆ బాధలో తాను కూడా తండ్రికి తెలియకుండా మద్యం తాగినట్టు చెప్పుకొచ్చారు. అదేమి గొప్ప పని కాదని… సెటిల్ అవ్వాల్సిన సమయంలో వ్యసనాలకు బానిస కావోద్దని యువతకు సూచించారు.