సినిమాల్లోకి వచ్చే ముందు ఉండే కలలు వేరు. వచ్చిన తర్వాత మారే పరిస్థితిలు వేరుగా ఉంటాయి. హీరో కావాలని వచ్చిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావడం, హీరోయిన్ కావాలి అనుకున్న వాళ్ళు అమ్మ పాత్రలు చేయడం వంటివి చూస్తూనే ఉంటాం. అగ్ర హీరోయిన్ల కెరీర్ తారుమారు అయిపోతు ఉంటుంది. ఇలా హీరోయిన్ కావాలి అనుకుని వచ్చి వ్యాంప్ పాత్రలు చేసారు జయమాలిని.
తమిళంలో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. దీనితో జయమాలిని వ్యాంప్ పాత్రలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో బి. విఠలాచార్య సినిమాలో నటించారు. ఆయనకు దూరద్రుష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకనే తన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరి టాలెంట్ ను ఆయన గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో పొట్టి ప్రసాద్, జయమాలిని కూడా ఉన్నారు.
జగన్మోహిని సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు. అప్పటికే ఆమె వ్యాంప్ పాత్రలు చేసారు. వ్యాంప్ క్యారెక్టర్లు అంటే కథలో కూడా భాగంగా ఉండేవి. ఇక ఆమె టాలెంట్ ను గుర్తించిన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావని కాబట్టి ఆ వైపుగా అడుగులు వేయాలని సలహా ఇచ్చేసారు. స్వయంగా ఎన్టీఆర్ ఆ మాట చెప్పడంతో ఆమె వెనక్కు తిరిగి ఆలోచించకుండా చెన్నైలో జయ డ్యాన్స్ స్కూల్ పేరుతో ఒక స్కూల్ పెట్టి బాగా సక్సెస్ అయ్యారు.