వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి గాను కొత్త పన్నుల విధానంలో పన్ను చెల్లింపు విధానానికి, పాత పధ్దతిలో చెల్లింపునకు మధ్య కలిగే తేడాలు లేదా ప్రయోజనాలను ఎవరైనా పోల్చి చూసినప్పుడు..సులభతరమైన పధ్దతినే ఎంచుకుంటారు. 11 లక్షల రూపాయల ఆదాయంలోపు ఉన్న గత పన్ను చెల్లింపు విధానం కింద టాక్స్ లయబిలిటీని జీరో స్థాయికి తెచ్చేందుకే మొగ్గు చూపడం సర్వసాధారణం.
ఒకటిన్నర లక్షల రూపాయల లోపు ..పీపీఎఫ్, ఎన్ఎస్ సి వంటి ఇన్వెస్టిమెంట్లకు సెక్షన్ 80 సి కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, భార్య లేదా భర్త లేక డిపెండెంట్ చిల్డ్రన్ (పిల్లల) కోసమో హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లింపుల కోసం సెక్షన్ 80 డీ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కూడా..
తలిదండ్రుల ఆరోగ్య ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లింపుల కోసం సెక్షన్ 80 డీ కింద 50 వేల రూపాయల వరకు అదనపు డిడక్షన్ సదుపాయం ఉంది. 10 వేలరూపాయల వరకు బ్యాంక్ అకౌంట్ల సేవింగ్స్ పై వడ్డీ కి గాను 80 టీటీయే సెక్షన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
2 లక్షల రూపాయల వరకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పెయిడ్ (వడ్డీ చెల్లింపు) కోసం సెక్షన్ 24 కిందకూడా ఈ వెసులుబాటు ఉంది. ఇలాంటి డిడక్షన్ల సదుపాయాన్ని వినియోగించుకుని పాత పన్నుల విధానం కింద టాక్స్ లయబిలిటీని జీరో స్థాయికి తెచ్చుకోవచ్చు. పన్ను చట్టాలు, రెగ్యులేషన్లను బట్టి మన మినహాయింపులు, ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.