వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత ప్రజల్లో నుండి వచ్చిన ఆగ్రహావేశాలు అంతా ఇంతా కాదు. దిశను హతమార్చిన ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయండి అంటూ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చారు. దిశ నిందితుల విచారణ షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతుందని తెలిసి… ప్రజలు వేల సంఖ్యలో అక్కడికి చేరుకొని వారిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే ఆ నలుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
అయితే, ఎన్‌కౌంటర్ జరగ్గానే సీన్‌లోకి హెచ్చార్సీ ఎంటరయిపోయింది. అయితే హెచ్చార్సీ వచ్చింది ఎన్‌కౌంటర్ నిజమైందో కాదో అని తేల్చడానికి కాదని, ఒకవేళ ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే సీపీ సజ్జనార్‌ను రక్షించడానికి అంటూ న్యాయవాది గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన ఎన్‌కౌంటర్ అయితే… ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం వారందరికీ మరణశిక్ష పడుంది. కాబట్టి వారిపై ఎలాంటి శిక్ష పడకూడదనే న్యాయవిచారణను అడ్డుకోవడానికే హెచ్చార్సీ రంగంలోకి దిగిందని ఆరోపించారు. అందుకే హెచ్చార్సీ ముందుగా షాద్‌నగర్ వెళ్లిందని, వారు సజ్జనార్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తారనుకోవటం భ్రమేనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో గోపాలకృష్ణ కళానిధి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
దిశ హత్యాచారం కేసు, నిందితుల విచారణ, ఎన్‌కౌంటర్ అంశాలన్నీ సీపీ సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే సుప్రీం విచారణకు సజ్జనార్ స్వయంగా హాజరుకావటం విశేషం.