వారం తిరిగేసరికి బయ్యర్లకు లాభాలు అందించింది హిట్-2 మూవీ. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకోవడంతో పాటు బయ్యర్లకు లాభాలు అందించింది ఈ సినిమా.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రచారం చేస్తూనే ఉంది యూనిట్. మరీ ముఖ్యంగా హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో హిట్-2 థియేట్రికల్ రన్ ఇంకొన్ని రోజులు పెరిగింది.
మార్కెట్లోకి డజనుకు పైగా సినిమాలు ఒకేసారి వచ్చినప్పటికీ ఈ సినిమా హవా తగ్గేలా లేదు. ఈ వీకెండ్ కూడా హిట్-2కు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక వసూళ్ల విషయానికొస్తే, విడుదలైన ఈ వారం రోజుల్లో హిట్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయల గ్రాస్ (12 కోట్ల 69 లక్షల షేర్) వచ్చింది. బ్రేకప్ ఇలా ఉంది..
నైజాం – 6.21 కోట్లు
సీడెడ్ – 1.36 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.67 కోట్లు
ఈస్ట్ – 83 లక్షలు
వెస్ట్ – 55 లక్షలు
గుంటూరు – 83 లక్షలు
కృష్ణా – 76 లక్షలు
నెల్లూరు – 48 లక్షలు