బాలీవుడ్ ను సౌత్ సినిమా పూర్తిగా డామినేట్ చేసి పడేసింది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా అది స్పష్టంగా కనిపిస్తోంది. కేజీఎఫ్-2, పుష్ప, ఆర్ఆర్ఆర్.. తాజాగా విక్రమ్.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బాలీవుడ్ ను ఏలుతోంది. దీంతో సహజంగానే హిందీ మేకర్స్ కు కడుపు రగిలిపోతోంది. నార్త్ ఆడియన్స్ పల్స్ ను పట్టుకోలేక ఫెయిల్ అవుతున్న బాలీవుడ్ మేకర్స్.. సౌత్ సినిమాకు దాసోహం అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య సౌత్ సినిమాను పొగుడుతున్నారు. సౌత్ సెలబ్రిటీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.
మొన్నటివరకు దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఇదే పని చేశాడు. కానీ తన కడుపులో ఉన్న ఆక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు. కేజీఎఫ్ 2 సినిమా కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇక తట్టుకోలేకపోయాడు. “కేజీఎఫ్ రివ్యూలు చదువుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఇలాంటి సినిమాలు మనం తీస్తే చీల్చిచెండాడేవారేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కేజీఎఫ్ ను సూపర్ అంటున్నారు. సెలబ్రేట్ చేస్తున్నారు. నిజమే, సినిమా ఫెంటాస్టిక్ గా ఉంది. నేను దీన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ నా బాధ ఒకటే. ఇదే సినిమాను
హిందీలో మేం తీస్తే పరిస్థితేంటి? మనకి ఇక్కడ ఎలాంటి మినహాయింపులు లేవు. వేరే వాళ్లలా మారడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అది అక్కర్లేదు. మనం ప్రపంచమంతా ఉన్నాం. ఈ 2 బతుకులు మనకు అక్కర్లేదు.ష ఇలా తన మనసులో ఉన్న బాధ మొత్తం కక్కేశాడు కరణ్ జోహార్. బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. సౌత్ సినిమాలు హిందీలో సూపర్ హిట్ అవుతుండేసరికి కరణ్ కు బాధేసింది. దీనిపై నెటిజన్లు గట్టిగానే కరణ్ కు క్లాస్ పీకుతున్నారు.
నెపొటిజాన్ని ప్రోత్సహించడం మానేసి, టాలెంట్ ను ప్రోత్సహించాలని కరణ్ కు సూచిస్తున్నారు. కేజీఎఫ్2 సినిమాకు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఒక్క బాలీవుడ్ నుంచే ఈ సినిమాకు 435 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం విక్రమ్ సినిమాకు నార్త్ బెల్ట్ నుంచి భారీ వసూళ్లు వస్తున్నాయి.