ఢిల్లీ: బైక్ ఉంది కదా…అని రయ్ రయ్ మంటూ రూల్స్ పాటించకుండా దూసుకుపోతే ఫైన్ చూసి సొమ్మసిల్లి పడిపోవాల్సిందే…! కొత్త మోటార్ యాక్ట్ గురూ…ఒక్క కిక్ కొడితే గూబ గుయ్ మానాల్సిందే..! కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానాలు వడ్డించేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయిపోయారు. ఫస్టు ఎక్స్‌పీరియెన్స్ ఢిల్లీకి చెందిన ఓ టూవీలర్ వోనర్‌కి ఎదురైంది. బండి తీసుకుని వెనకాముందు చూడకుండా గుర్ గాంవ్‌లో అతను దూసుకుపోతున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి కొత్త యాక్ట్ ప్రకారం ఫైన్ చిట్టా చదివారు. మల్టిపుల్ ట్రాఫిక్ వయోలేషన్స్ ప్రకారం ఏకంగా 23 వేలు కట్టాలని హుకుం జారీచేశారు. దీంతో అతనికి మైండ్ బ్లాంక్…! దటీజ్ న్యూ యాక్ట్…! బాబూ బీ అలెర్ట్..!!
A Delhi-based owner of a two-wheeler fined Rs 23,000 in Gurugram for violating multiple traffic rules as per newly-ammended Motor Vehicles Act that came into being on Sep 1. pic.twitter.com/zsfWC1grkE
— Gulam Jeelani (@jeelanikash) September 3, 2019