బీరుట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో వందల మంది వరకు మరణించారని సమాచారం .ఒక్కసారిగా సంభవించిన పేలుడు ధాటికి కిటికీలు, తలుపులు పగిలిపోయాయి. ప్రమాదం జరిగిన స్థలానికి వందల అడుగుల దూరంలో ఉన్న భవనాలు సైతం కదిలాయి. దాదాపు 150 కిలోమీటర్ ల వరకు పేలుడు తీవ్రత తాకినట్టు తెలుస్తుంది. లెబనీస్ రాజధాని ఓడరేవులో సంభవించిన పేలుడు కారణంగా చుట్టుపక్కల హైవే మీద కార్లు నిండిపోయాయి.
వందల మంది ప్రమాదంలో గాయపడ్డారని, గాయపడిన వ్యక్తులతో ఆసుపత్రి సైతం నిండిపోయినట్టు స్థానిక మీడియా లో ప్రసారం జరుగుతుంది. వందల సంఖ్య లో మరణాలు నమోదు కావటానికి కారణం అయిన ఈ ప్రమాదం ఎలా సంభవించిందనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.