తినే ప్లేస్ ని బట్టి రేట్ మారుతుంది.అది బిర్యానీ కావొచ్చు బిస్కెట్ కావొచ్చు. సేమ్ మనీతో ఇంటిల్లిపాదీ తినొచ్చు అనిపిస్తుంది. ఇంత బిల్లేసారేంటని అడగడానికి అహం ఆరాట పడినా, చుట్టూ ఉన్న పరిస్థితులు కిక్కురుమన కుండా కూర్చోబెడతాయి.విమానాశ్రయంలో కొన్న రెండు సమోసాల రేటు చాచి పెట్టికొట్టిందంట. ఫరాఖాన్ అనే ఓ జర్నలిస్ట్ తన సమోసా సేడ్నెస్ ని ట్విట్టర్లో మొరపెట్టుకుంది. కామెంట్లు మాత్రం కట్టలు తెంచుకున్నాయి.
సాయంత్రం స్నాక్స్ గా తినే సమోసాకు ఓ 20 రూపాయలు, చాయ్ కి మరో 20 రూపాయలు.. అంటే ఆల్మోస్ట్ 50 రూపాయల్లో అంతా జరిగిపోతుంది. కానీ, మన జర్నలిస్ట్ ఫరాఖాన్ కి ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కలిపి రూ.490 బిల్లైందట. అది ఎక్కడ, ఏంటీ అన్న విషయానికొస్తే..ఇటీవల తనకు ముంబయి విమానాశ్రయంలో ఎదురైన ఈ వింత అనుభవాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.
ఎయిర్ పోర్ట్ లో తాను ఒక హాట్ చాయ్, 2 క్రిస్పీ సమోసాలు, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేశానని ఆమె చెప్పుకొచ్చింది. వీటన్నింటికీ మామూలుగా అయితే రూ.50 నుంచి 100 రూపాయల్లో అయిపోతుంది. కానీ తనకు మాత్రం రూ.490 బిల్లు అయిందని రాసుకొచ్చింది. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది.
దాంతో పాటు గొప్ప రోజులు వచ్చాయి అనే క్యాప్షన్ ను కూడా ఈ పోస్ట్ కు ఆమె జత చేసింది. ఇది ఎంత రుచికరంగా అనిపించినప్పటికీ, రెండింటి ధర మాత్రం చాలా ఎక్కువ అని పలువురు భావిస్తున్నారు. డిసెంబర్ 28న చేసిన ఈ పోస్ట్ కు ఇప్పటివరకు 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో.. ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.