వరుస ప్రమాదాలతో విశాఖ వణికిపోతోంది. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు పరుగులు తీశారు.ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు సమీపంలోనే ఫైరింజన్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడు ఘటనతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.