యన్టీఆర్ నట వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా, వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ 4 హీరోల్లో స్థానం దక్కించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ మధ్యకాలంలో మాత్రం ఒకింత విజయాల కోసం ఎదురీదుతూ ఫ్లాపులతో వెళ్ళదీస్తున్నారు బాలయ్య. రీసెంట్‌గా తమిళ దర్శకుడు కే.యస్.రవికుమార్‌తో జైసింహా సినిమా చేసి తన ఖాతాలో మరో ఫ్లాప్ సినిమాను మూటకట్టుకున్నాడు బాలయ్య.ఇప్పుడు అందరి అంచనాలకు భిన్నంగా ఇప్పుడు తన 105వ చిత్రం మళ్ళీ కె.యస్.రవికుమార్‌తోనే చేస్తూ ఉండడం, అందులో కూడా ఒక కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపిస్తూ ఉండడం బాలయ్య అభిమానుల్లో గందరగోళం, భయాలను సృష్టిస్తున్నాయి. బాలయ్య 105వ సినిమాకు ఈ సినిమా నిర్మాత సి.కల్యాణ్ ఏకంగా 30 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తుండడం కూడా మరో సెన్సేషనల్ విషయంగానే చెప్పుకోవాలి.
ఎందుకంటే 30 కోట్లతో బాలయ్య సినిమా చేయడమంటే ఒక విధంగా రిస్కే. ఇది బ్రేక్ ఈవెన్ సాధించి 30-40 కోట్ల వసూళ్ళు సాధించాలంటే సూపర్ డూపర్ హిట్ అయితీరాలి. ఒకవేళ ఫలితం ఏదైనా తారుమారయి ఫ్లాప్ లేదా యావరేజ్ అయితే బాలయ్య సినిమాల కలెక్షన్స్ కేవలం 5 నుంచి 10 కోట్ల మధ్యలోనే లెక్కతేలుతాయి. మరి కల్యాణ్ ఇవన్నీ ఆలోచించుకునే బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారా అనేది ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. నిజంగానే బాలయ్య ఇప్పుడు చేస్తున్న రవికుమార్ సినిమాకు అంత పెద్ద హిట్టుగా నిలిచిపోయేంత విషయం ఉందా? చూద్దాం, ఎలాగూ ఈ సంక్రాంతికే విడుదల అంటున్నారుగా. బాలయ్య 105వ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్ జంటగా కనిపించబోతున్నారు.