రన్ బీర్, అలియా భట్ ప్రధానపాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్రహ్మాస్త్రా. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికే రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ సినిమాకు పెట్టని బడ్జెట్ ను ఈ సినిమాకు పెడుతున్నామని ప్రకటించారు. అయితే ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. సాహో, బాహుబలి వంటి సినిమాలు గతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో బ్రహ్మాస్త్రా సినిమాను కరణ్ జోహార్, డిస్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.