వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల గణేష్ ప్రతిమలు దర్శనం ఇస్తుంటాయి. ఈఏడాది కూడా దేశవ్యాప్తంగా వెరైటీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో వ్యాక్సిన్ గణేష్ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో జీడి పిక్కలతో విగ్రహం తయారు చేశారు. ఇలా ఎన్నో రకాల గణేష్ ప్రతిమలు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. పూజలు అందుకుంటున్నాయి. అయితే పంజాబ్ కు వెళ్తే డార్క్ చాక్లెట్ వినాయకుడు కనిపిస్తాడు.
లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ 200 కేజీల చాక్లెట్ గణేష్ విగ్రహాన్ని తయారు చేయించాడు. దీన్ని పాలల్లో నిమజ్జనం చేసి.. వాటిని పేద పిల్లలకు పంచి పెడుతుంటాడు. ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నాడు హర్జిందర్. ఈ ఐడియా సూపర్ గా ఉందంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. చాక్లెట్ గణేష్ వీడియో, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.