ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు 4 గంటలు, వీఐపీ దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. ఆలయ సిబ్బంది భక్తులకు లఘు దర్శనం కల్పించారు. రద్దీ దృష్ట్యా పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించలేదు.