వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ దగ్గర నీటిమట్టం 12 మీటర్లకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. పుష్కర ఘాట్ దగ్గర వరద నీరు 12.57 మీటర్ల ఎత్తులో పారుతోంది. సరస్వతి బ్యారేజ్ 62, లక్ష్మి బ్యారేజ్ 79 గేట్లను ఎత్తారు అధికారులు. 1.09 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
పైనుంచి వరదనీరు వస్తుండడంతో భద్రాచలం దగ్గర కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 5,71,070 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా… నీటిమట్టం 34.7 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 7.30 అడుగులకు చేరింది నీటిమట్టం. బ్యారేజ్ నుంచి 4.86 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు. అలాగే డెల్టాలోని కాలువలకు 3వేల క్యూసెక్కుల సాగునీరు వదిలారు.