గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు,చెరువులు,కాలువలు అన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి.తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది.
జూరాల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేశుల నుంచి 1.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చిచేరుతున్నది. దీంతో జలాశయం నీటిమట్టం 840.1 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం గరిష్ట నీటినిల్వ 215.8 టీఎంసీలు. ఇప్పుడు 61.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ప్రాజెక్టులోకి వరద వస్తుండంతో ఎడగట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సందర్శకులెవరిని అధికారులు అనుమతించడం లేదు.
జూరాలకు భారీగా వరదనీరు..
ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1.45 లక్షల క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టుకు 23 గేట్ల ద్వారా 1,40 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 7.48 టీఎంసీలు. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 7.72 టీఎంసీలు