మెఘా ఇండ్లు, కార్యాలయాల్లో జరుగుతోన్న సోదాల్లో ఇప్పటికే భారీగా సీజ్ చేశారా…? డబ్బాల కొద్ది అభరణాల విలువ వందల కోట్లలో ఉండనుందా…? మెఘా ఇంట్లో ఉన్న అతి ఖరీదైన వాహనాన్ని కూడా సీజ్ చేశారా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బంగారంతో పాటు, ఐదో రోజు మరిన్ని టీంలు పలు చోట్ల ఇలాంటి బాక్స్‌లనే స్వాధీనం చేసుకున్నట్లు తొలివెలుగుకు సమాచారం అందుతోంది. అయితే, ఇప్పటికే సీజ్ చేసిన ఓ బాక్స్‌పై Annexure J అనే కోడ్ ఉంది. పైగా దానిపై 2.47కోట్ల విలువ చేసేది అని కూడా ఉంది. అంటే… Annexure Jను డీకోడ్ చేస్తే… అంతకుముందు మరో పది బాక్స్‌లు ఉన్నట్లుగా భావించవచ్చు. పైగా ప్రతి బాక్స్‌లో 2.47కోట్లకు మించిన విలువ గల అభరణాలే ఉండి ఉంటాయనటంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూసినా… కేవలంగా బంగారు-వజ్రాభరణాల విలువే చాలా ఎక్కువ. పైగా… ఈ బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసిన జ్యూవెలరీ సంస్థలపై ఇప్పటికే ఎన్నో మనిలాండరింగ్ కేసులు ఉన్నందున, వాటి విలువ తక్కువగా చూపి, మనీలాండరింగ్ ద్వారా మిగతా మొత్తాన్ని చెల్లించి ఉండవచ్చని, సీజ్ చేసిన వాటిని లెక్కిస్తే అసలు విషయాలు బయటపడుతాయంటున్నారు విశ్లేషకులు.