చాలా రోజుల తర్వాత దేశంలో కరోనా కేసులు 30వేల దిగువకు వచ్చాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,30,125 మందికి పరీక్షలు నిర్వహించగా 28,591 కేసులు బయటపడ్డాయి. కొత్తగా 338 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఓవరాల్ గా మరణించిన వారి సంఖ్య 4,42,655కి పెరిగింది.
అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కవగా ఉండడం కాస్త ఊరటనిస్తోంది. శనివారం 34,848 మంది వైరస్ ను జయించారు. రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,84,921 గా ఉన్నాయి.
కేరళను మహమ్మారి వదలనంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అక్కడ వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కొత్తగా నమోదైన 28,591 కేసుల్లో… 20వేలు కేరళ నుంచే ఉన్నాయి. అలాగే 181 మంది ఆ రాష్ట్రం నుంచే చనిపోయారు.
ఇక వ్యాక్సినేషన్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది భారత్. శనివారం ఒక్కరోజే 72,86,883 మందికి టీకాలు అందాయి. ఇప్పటిదాకా 73.82 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు.