తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన చలాన్ క్లియరెన్స్ కు భారీ స్పందన లభించింది. మార్చి ఒకటి నుంచి 15 వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిమిషానికి వెయ్యి మంది చలాన్స్ చెల్లిస్తున్నారని తెలిపారు.
వారిలో 80 శాతానికిపైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వాహనదారులు ఉన్నట్టు చెప్పారు. ఈనెల 31 వరకు చలాన్లు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు. రాయితీకి మరో 15 రోజుల గడువు మిగిలి ఉండగానే.. రూ.140 కోట్ల జరిమానాలు వసూలయ్యాయని స్పష్టం చేశారు అధికారులు.
ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. తనిఖీల్లో చలాన్లు ఉన్నట్టు తేలితే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేస్తామని తేల్చి చెప్పారు. చలాన్లను క్లియర్ చేయని వారు ఆన్ లైన్, మీ సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చన్నారు.
ఈ చలాన్లకు సంబంధించి వెబ్ సైట్ https:/echallan.tspolice.gov.in లింక్ ద్వారా రాయితీతో జరిమానా చెల్లించుకోవాలని సూచించారు.