ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు 70కిలోల బంగారం చోరీ అయినట్లు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ 70 కిలోల బంగారం విలువ 16కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. సంస్థ ఉన్న భవనంలోని టాయిలెట్స్ నుండి గోడకు గ్యాస్ కట్టర్స్‌తో కన్నం పెట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు.
ఆ తర్వాత బీరువాలు, లాకర్లను ధ్వంసం చేసి బంగారు నగలను పరారయ్యారు. ఆధారాలు లభించకుండా నిందితులు సైరన్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఉదయం ఉద్యోగులు వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దోపిడీ బెంగళూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కేంద్ర కార్యాలయంలో జరిగింది.