జమ్మూ కశ్మీర్ కి తలమానికమైన వెష్ణోదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కొత్త సంవత్సరాన్ని అమ్మవారి ఆశీశ్శులతో మొదలుపెట్టేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో వైష్ణోమాత ఆలయం భక్తసంద్రమైంది.
అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కొత్త ఏడాది సందర్భంగా వైష్ణో దేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. కాగా, గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.