డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రం కు ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెండవ వారం నుంచి ఈ సెట్ లో భారీ ఫైట్ సీన్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుంది.