మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా సర్కారువారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఏకంగా 8 భారీ సెట్స్ ఉన్నాయంట. ఆ వివరాల్ని ఆర్ట్ డైరక్టర్ ఏఎస్ ప్రకాష్ బయటపెట్టారు.
“సర్కారు వారి పాట స్టోరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం.”
ఇలా సర్కారువారి పాట నేపథ్యాన్ని బయటపెట్టాడు ప్రకాష్. బ్యాంక్ సెట్స్ తో పాటు వేసిన మిగతా సెట్స్ వివరాల్ని కూడా బయటపెట్టారు. చాలా వరకు సినిమా షూటింగ్ ఈ సెట్స్ లోనే జరిగిందట.
“భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం.”
మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.