ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ను మంచు కప్పేసి ఉండటంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకి రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 దాటినా మంచు కమ్మేసి ఉండటంతో ప్రజలంతా ఇంటికి పరిమితం అవుతున్నారు. ఇక వృద్ధుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. చలితో ఇంట్లోనే కునుకుతీస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లే వారంతా ఆలస్యంగా బయలుదేరుతున్నారు.