ఉక్రెయిన్ లో మానవీయ పరిస్థితులు క్షీణిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని యూఎన్ ఆఫీస్ ఫర్ కో ఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్(యూఎన్ఓ సీహెచ్ఏ) తెలిపింది.
ఉక్రెయిన్ లో ఇప్పటి వరకు 1.9 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులు అయినట్టు చెప్పింది. 2.3 మిలియన్లకు పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణ భయంతో అంతర్జాతీయ సరిహద్దులు దాటినట్టు వెల్లడించింది.
ఉక్రెయిన్ లో పౌర మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నివేదిక ప్రకారం ఫిబ్రవరి 24- మార్చి 9 మధ్య 1,506 పౌర మరణాలు నమోదయ్యాయి. వారిలో 41 మంది పిల్లలు మరణించినట్టు తెలిపింది.
‘ పౌరులు ఉక్రెయిలో ఉన్నా.. లేదా దేశాన్ని విడిచిపెట్టి పోయినా వారిని రక్షించాలి. ఇప్పుడు మానవతా సామగ్రి తరలించేందుకు సురక్షితమైన మార్గం అవసరం. ఇప్పుడు ఇరు దేశాలతో మాకు స్థిరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరం” అని ఓసిహెచ్‌ఎ తెలిపింది.