కొన్ని సందర్భాల్లో ఎదుటివారి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే మాటలతోనో, ఆయుధాలతోనో దాడి చేసి తీర్చుకుంటారు. కానీ.. ఇక్కడ బొద్దింకల ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఇందేంటి వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా..? అవునండీ బొద్దింకల వల్ల ఏకంగా కోర్టునే మూసేయడం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే..
న్యూయార్క్ లోని ఓ కోర్టులో తాజాగా ఓ కేసు విచారణ జరుగుతోంది. ఇరు పక్షాల వాదనలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కోర్టు లోపలికి బొద్దింకలు వచ్చాయి.
ఒకటి, రెండు కాదండీ బాబు.. ఏకంగా వందల సంఖ్యలో బొద్దింకలు రావడంతో కేసును వాయిదా వేశారు. దాంతో పాటు బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాలంటూ కోర్టును కూడా మూసివేశారు.
కోర్టులోనికి బొద్దింకలను విడిచిన ఘటనపై విచారణ జరుగుతోంది. వాటిని కొన్ని కంటైనర్లలో తీసుకువచ్చి వదిలినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.