సుధీర్ బాబు తాజా చిత్రం హంట్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో, సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ టాక్ బయటకొచ్చింది.
హంట్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయట. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే 2 బ్లాక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని టాక్. సెకండాఫ్ లో మాత్రం యాక్షన్ కంటే, థ్రిల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయనే టాక్ బయటకొచ్చింది. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెన్సార్ టాక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
శ్రీకాంత్, భరత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సుధీర్ బాబు.