సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సుధీర్ బాబు, ఎక్కడైతే తను ధైర్యం చేశానని చెప్పాడో, ఆ కోణం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. స్పాయిలర్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కోణం ఏంటనేది ఇక్కడ చెప్పడం లేదు.
మొత్తమ్మీద మొదటి రోజే హంట్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. మరోవైపు సుధీర్ బాబు సినిమాలకు క్రేజ్ పెద్దగా లేకపోవడంతో, ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లాంటివేం దక్కలేదు. అలా మొదటి రోజు హంట్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 3 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. మొదటి రోజు వసూళ్లు, వచ్చిన టాక్ తో పోల్చి చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం అని తేలిపోయింది.
అటు ఓవర్సీస్ లో కూడా హంట్ సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. మొదటి రోజు ఈ సినిమాకు 4వేల 800 డాలర్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమని తేలిపోయింది. అలా మొదటి రోజే హంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టయింది.