క్షణికావేశం ఎంతటి దారుణానికి కారణం అవుతుందో చెప్పే ఘటన ఇది. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో భార్య మందు తాగిందన్న కోపంతో భర్త దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.
పాచిపెంట మండలం మాముతూరు గ్రామంలో శోభన్, తులసి పామాయిల్ తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం తులసి తల్లి ఇచ్చిందని ఆమెతో కలిసి సాలూరుకు వెళ్లింది. సాయంత్రం తిరిగొచ్చిన ఆమె ఫుల్లుగా మద్యం సేవించి ఉండటంతో శోభన్ ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే తులసి కూడా శోభన్ పై ఆగ్రహం వ్యక్తం చేయటతో…. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శోభన్ తన భార్యను ఇంటికి కాస్తంత దూరం తీసుకెళ్లి ఓ కర్రతో ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన తులసి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుంది.