గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. మాములుగా భార్య, భర్తల మధ్య గొడవలు సహజంగా వస్తుంటాయి. ఈ రోజు గొడవలు వస్తుంటాయి.. రేపు కలుసుకుంటారు. కానీ భార్య స్పైసీ ఫుడ్ వండలేదని నేను బతకను అని బాల్కనీ నుంచి కిందకు దూకబోయాడు. వివరాల్లోకి వెళ్తే హర్మేష్ సుఖాడియా వాతావరణం చల్లగా ఉండటంతో భార్యను స్పైసీ ఫుడ్ వండమన్నాడు. అప్పటికే పనుల్లో బిజీగా ఉన్న ఆమె… కుదరదు… నేను ఏది వండితే అది తినండి. లేకపోతే మానేయండి అంది. అంతేలే నేను లోకువైపోయాను. వండమన్న వంట చెయ్యవా… నేను లేకపోతే నీకు అప్పుడు తెలుస్తుంది అంటూ బాల్కనీ ఎక్కి కిందకు దూకబోయాడు.
అయ్యో అయ్యో అంటూ… చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకొచ్చారు. హర్మేష్… ఏంటయ్యా ఏమమైంది… ఎందుకు అలా చేస్తున్నావ్.. చావాల్సినంత కష్టం ఏమొచ్చింది. భలే వాడివే… అనేసరికి… అటు కిందకు దూకలేక… ఇటు పైకి ఎక్కలేక… మధ్యలో వేలాడసాగాడు. అందరూ వచ్చి తలో చెయ్యీ వేసి అతని చేతులు పట్టుకొని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. అయితే ఇదంతా వీడియో తెసినవాళ్లు సోషల్ మీడియా లో పెట్టారు. విషయం చుట్టూ తిరిగి పోలీసులకు చేరింది. ఈ వీడియోని ఎవరో దారినపోయే దానయ్య షూట్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు చుట్టు పక్కల వాళ్లంతా వచ్చి… హర్మేష్‌ని ఓదార్చుతున్నారు. అంత స్పైసీ కావాలనుకుంటే… మా ఇంటికి రా… చికెన్ బిర్యానీ వండి పెడతాం… అని ఆఫర్లు ఇస్తున్నారు.