అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్, పుణ్యవతిలకు మే నెలలో వివాహం జరిగింది. అప్పటి నుండి సంతోష్ కి భార్య పైన అనుమానం ఉండేది. దీంతో భార్యా భర్తల మధ్య తరుచూ గొడవలు అవుతుండేవి.
గత రాత్రి నుండి ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు తలుపులు తెరిచి చూసే సరికి పుణ్యవతి అప్పటికే చనిపోవడంతో… బాధితురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలు ఒంటి మీదున్న గుర్తుల ఆధారంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.