పంజాబ్, హర్యానా హైకోర్టు ముందుకు విచిత్రమైన విడాకుల కేసు వచ్చింది. భార్య వేధింపులను తట్టుకోలేక దివ్యాంగుడైన ఓ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఆమె పెట్టే బాధలకు మానసికంగా కృంగిపోతున్నాని, పెళ్లయిన నాటి నుంచి 21 కిలోల బరువు కోల్పోయానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. భర్త పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బాధితుడు చెప్పేది నిజమేనని నిర్ధారించి. ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
బాధితుడికి వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి తనను తీవ్రంగా వేధించేదని, పండుగల కోసం బంధువుల ఇళ్లకు వెళ్లనిచ్చేది కాదని, వీధుల్లో వేడుకలు జరిగినా బయటకు పోకుండా ఆంక్షలు పెట్టేదని, చీటికి మాటికి ఘర్షణపడేదని బాధితుడు కోర్టు ఎదుట వాపోయాడు. తన భార్య పెట్టే టార్చర్‌కు 74 కిలోలున్న తన శరీర బరువు 53 కిలోలకు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకు ముందు విడాకులు ఇవ్వడం కుదరదని హిసార్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, బాధితుడికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.