చాలా మంది మగవాళ్ళు పెళ్లి జరిగిన తర్వాత కూడా పరాయి స్త్రీలపై మోజు పడుతూ ఉంటారు. వాటికి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. అలాగే పెళ్లి అయిన ఆడవాళ్లు కూడా వేరే మగవాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి మగవాళ్లకు ఎలా బ్రతకాలో తెలిదు. ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారికే సరెండర్ అయిపోతారు. వేరే ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే భర్త భార్య పై, భార్య భర్త పై ప్రేమ చూపిస్తే చాలు. అప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు.
నా భర్త నన్ను అంతగా ఇష్టపడటం లేదని, ప్రేమ చూపించడం లేదని ఆలోచిస్తూ కొంత మంది భార్యలు ఉంటారు. కానీ భర్తకు ఆమెలో నచ్చనిది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అందుకే అలా దూరం పెడుతూ ఉంటారు. అది విడి పోయే వరకు కూడా దారితీస్తుంది. అలా విడి పోవడానికి ప్రధాన కారణం స్వేచ్ఛగా బతకాలనుకోవడం, ఇతరులను చూసి వారిలాగా ఎంజాయ్ చేయాలనుకోవడం. వీటన్నింటి వల్ల భార్యతో సరిగ్గా మాట్లాడలేరు.
మరోవైపు భార్య… భర్త ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటుంది. మరికొంత మంది ఉద్యోగానికి వెళ్లి అలసిపోయి ఉంటారని కనీసం అర్థం చేసుకోరు. అలాగే భర్తలు కూడా నా భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని ఆమెతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి అని కూడా అనుకోరు. ఆఫీసులో ఉన్న ఫ్రస్టేషన్ అంతా ఆమెపై చూపిస్తూ ఉంటారు. ఇలాంటి కారణాలు భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి.
నటి దీప గుర్తుందా ? ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా ?
కొట్టుకోవడం, తిట్టుకోటం విడాకుల వరకు వెళ్లడంకు కూడా కారణాలు ప్రధానంగా ఇవే ఉంటాయి. ఈ మూడు పక్కన పెడితే మరొకటి వ్యామోహం. ఇంట్లో మంచి ఆహారం లభిస్తుంటే హోటల్ కు వెళ్లి ఎవరు తినాలి అనుకోరు. ఆ ఆలోచన కూడా రాదు. అందుకోసమే పూర్వీకులు కొన్ని సంప్రదాయాలు కూడా తీసుకొచ్చారు. కానీ వాటిని ఇటీవల కాలంలో ఎవరూ పట్టించుకోవట్లేదు. పాటించట్లేదు. ఆలోచనా విధానం కూడా మారుతుంది. స్వేచ్ఛ కోరుకుంటున్నారు.
పురుషులైనా స్త్రీలైనా ఒకరికొకరు సర్దుకుని పోవాలి. అలా కాకుండా ఎవరు స్వేఛ్ఛను వారు కోరుకుంటే గొడవలు తప్పవు. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇంట్లో విషయాలను బహిరంగంగా చెప్పకూడదు. ఇంటిగుట్టు ఇంట్లోనే ఉంచితే భార్య భర్తలు జీవితాలు బాగుపడతాయి. లేదంటే పరాయి స్త్రీలవైపు మగవాళ్ళు, పరాయి మగవాళ్లవైపు స్త్రీలు మోజు పడే అవకాశం ఉంది.