హైదరాబాద్ రాచకొండ కీసర లో 7 మంది పేకాట రాయుళ్లును అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ రిసార్ట్ రూమ్ లో పేకాట అడుతుండగా వీరిని అరెస్ట్ చేశారు. మొత్తం వారి నుంచి 65,610 నగదు, 5 మొబైల్స్, 4 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో టీఆరెస్ పార్టీ మహిళ కార్పొరేటర్ల భర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారపార్టీ నాయకులు కావడంతో పోలీసులకు పై స్థాయి నాయకుల నుండి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. జవహర్ నగర్ 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్ తో పాటు 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగొని వెంకటేష్ , 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోదర్ రెడ్డిలు కూడా ఇందులో ఉన్నారు. వీరందరిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.