హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాదాపు 88శాతం వరకు పోలింగ్ అవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా.. భారీ పోలింగ్‌తో టీఆరెఎస్-కాంగ్రెస్‌లు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తుండగా, 24 న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.