బిగ్ బ్రేకింగ్- అక్టోబర్ 30న హుజురాబాద్ ఉప ఎన్నిక
నాలుగు నెలల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హుజురాబాద్ తో పాటు ఏపీలోని బద్వేల్ కు కూడా ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 8వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 11న నామినేషన్లు పరిశీలించనుండగా, అక్టోబర్ 13వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 30న పోలింగ్ ఉండనుండగా, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది.
టీఆర్ఎస్ నుండి ఈ ఉప ఎన్నిక బరిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుండి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
నోటిఫికేషన్ ప్రకటన రావటంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది.