హుజురాబాద్ లో ఇంకా ఓట్ల కొనుగోళ్ల పర్వం ఆగలేదు. కమలాపూర్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో సీల్డ్ కవర్లలో పంపిణీ చేస్తున్న డబ్బు స్థానికులు గుర్తించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వ్యక్తులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అనుచరులగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
సీల్డ్ కవర్లలోని డబ్బుతోపాటు వారిని పోలీసులకు స్థానికులు అప్పగించారు. అంతే కాకుండా 11కోట్లు ఎలా పంచాలో ఒక లిస్ట్ ను కూడా రెడీ చేసుకున్నారు. ఇక ఐదు గంటలవరకు 76. 26 శాతం పోలింగ్ నమోదు అయింది.