సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. నకిలీ ఈ మెయిల్ సృష్టించి ఓ కంపెనీకి ఏడున్నర లక్షల టోకరా వేశారు. బాగ్ అంబర్ పేట్ లోని ఏబీఆర్ ఆర్గానిక్ సంస్థ చైనా దేశానికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా రెండు కంపెనీలు కూడా ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా చైనా సంస్థ ఉపయోగించే ఈ మెయిల్ కు నకిలీ మెయిల్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు అకౌంట్ మారిందంటూ ఏబీఆర్ సంస్థకు మెయిల్ చేశారు.
ఈ క్రమంలో ఏబీఆర్ సంస్థ ప్రతినిధులు ఆ అకౌంట్లో ఏడున్నర లక్షలు జమ చేశారు. ఆ తరువాత మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.