అంబర్ పేట్ సీఐ సుధాకర్ పై పోలీస్ కేసు నమోదైంది. ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ పేరుతో తనను సీఐ చీటింగ్ చేశారంటూ ఓ ఎన్నారై కేసు పెట్టారు. ఓ ఎన్నారై నుంచి రూ. 54లక్షలకు పైగా నగదు తీసుకున్నట్టు సీఐపై ఆరోపణలు వచ్చాయి.
కందుకూరు మండలంలోని నేదునూరులోని సర్వే నంబర్‌లోని 54/2లో పది ఎకరాల భూమి లావాదేవీలకు సంబంధించి రూ. 54 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నెలలు గడుస్తున్నా భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారని గుర్తించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీం
బాధిత ఎన్నారై విజయ్ నాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఐ రాజేశ్ గౌడ్ తో పాటు సీఐ సుధాకర్ పై వనస్థలి పురంలో కేసు పెట్టారు. ఈ మేరకు ఉన్నతాధికారుల అనుమతితో సీఐ సుధాకర్‌ను వనస్థలి పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న ఆర్ఐ రాజేశ్ గౌడ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజేశ్‌గౌడ్‌పై పలు చీటింగ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ఆర్ఐని మోసం చేసేందుకు ఓ నకిలీ ఎమ్మార్వోను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.