లైఫ్ సైన్సెస్ అగ్రగామిగా హైదరాబాద్ ఉందని..ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఐటీ,పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 20వ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.
ఈ సదస్సుకు యూకే భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ ఇతివ ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, నీతి అయోగ్ సభ్యులు వీకే పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని, ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని తెలిపారు.
ఈ రంగంలో హైదరాబాద్ కు ఏడేళ్లలో 25 వేల కోట్లు వచ్చాయని, 800లకు పైగా ఫార్మా బయోటెక్ కంపెనీలున్నాయని కేటీఆర్ తెలిపారు. మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయని వెల్లడించారు.