కర్నూల్‌లో సాంబార్‌లో పడి చిన్నారి మృతిని మరవకముందే అలాంటి ఘటనే హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. మరుగుతున్న సాంబర్‌లో ఆరుష్ అనే బాలుడు పడి… తీవ్ర గాయాలతో ఆసుప్రతి పాలయ్యాడు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుష్ మరణించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఆరుష్ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. వంటగది వద్ద ఆడుకుంటున్న ఆరుష్ సాంబార్ పాత్రలో పడిపోవటంతో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అక్కడి నుండి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చామని తెలిపారు.