వంద మాటలేల..? ఒక్క ఫోటో చాలు.. అనుకున్నాడో ఫోటోగ్రాఫర్. జ్వరాలొచ్చి సచ్చిపోతున్నా పట్టించుకోని తెలంగాణా పాలకుల్ని నిద్రలేపడానికి ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న నీలోఫర్ ఆసుపత్రికి వచ్చి క్లిక్ కొట్టాడు. హైదరాబాద్‌లో జ్వరాలు జనాన్ని ఎలా వణికిస్తున్నాయో చెప్పడానికి ఈ చెప్పుల ఫోటో ఒక్కటి చాలు! నీలోఫర్ ఆసుపత్రిలో జ్వరమొచ్చిన పిల్లల్ని తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు చెప్పులు బయటే విడిచి లోపలికి వెళ్తుంటే అక్కడ ఇలా వేలాది చెప్పులు పోగయ్యి గుడి ముందు పడేసిన చెప్పుల్లా కనిపిస్తున్నాయి కదా.